ఇప్పటికే వచ్చిన అప్డేట్ లలో ఇది స్పష్టంగా తెలిసిపోయింది. మేకింగ్ హైలైట్ గా ఈ సినిమా నిలువబోతుంది. అలా ఈ సినిమా పై ఇన్ని అంచనాలు ఏర్పడడానికి కారణం డైరెక్టర్ అనే చెప్పాలి. హీరోయిన్ గా ఈ సినిమా లో సోనాల్ చౌహాన్ కనిపిస్తుండగా ఆమె కూడా తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. భరత్, సౌరభ్ సంగీతాన్ని అందించారు. మరి మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా కు పోటీగా రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమా కోసం అందరు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారట. ఇందులోని ఓ కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ కోసం సోనాల్ చౌహాన్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నదట.
సినిమా కోసం ఈ విధంగా చేసే నటీనటులు చాలా తక్కువ ఉంటారని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఆమె చేసిన రిస్క్ అంతా ఇంతా కాదు. ఈ శిక్షణలో ఆమె పాదం ఫ్రాక్చర్ కావడంతో చిత్ర యూనిట్ సోనాల్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ట్రైనింగ్ ఆపేయడమే కాకుండా ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు ఆమెకు సూచించినట్లు తెలిసింది. కానీ గాయాన్ని లెక్కచేయకుండా సోనాల్ ట్రైనింగ్ పూర్తిచేయడమే కాకుండా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో పాల్గొని సినిమా ఇంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సాయం చేసింది.