మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమా భారీగా డిజాస్టర్ కావడం జరిగింది. మొదటిసారిగా వెండి తేరపై రామ్ చరణ్ ,చిరంజీవి కలిసి నటించిన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ మొదటి షో తోనే ఈ సినిమా అభిమానులను ప్రేక్షకులను నిరాశపరిచింది. సినిమా చరిత్రలోనే మెగాస్టార్ ఇమేజ్ లో ఈ చిత్రం డామేజ్ చేసిందని చెప్పవచ్చు. ప్రేక్షకులతో సహా మెగా కుటుంబం కూడా ఈ చిత్రం చాలా నిరాశపరిచేలా చేసింది. ఇక తన కుమారుడిని.. తన భర్తని ఒకే ఫ్రేమ్ లో చూడాలని చిరంజీవి భార్య ఎప్పటినుంచో అనుకుంటోంది. అయితే అ కల నెరవేరినప్పటికీ ఈ చిత్రం మాత్రం పరాజయం అయింది.


చిరంజీవి తన భార్య సురేఖ ఎప్పుడు విదేశాలకు వెళ్ళని వారు కూడా ఈ సినిమా నుంచి ఉపశమనం కోసం అమెరికాకు వెళ్లడం కూడా జరిగింది. దీంతో ఒక వారం రోజులపాటు ఆచార్య సినిమా ఫ్లాప్ జ్ఞాపకాలను సైతం మర్చిపోవడానికీ అంత దూరం వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు తాజాగా గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి బిజీగా ఉన్నారు. ఈ సమయంలోనే ఆచార్య సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఆచార్య సినిమా డిజాస్టర్ తనని చరణ్ ని పెద్దగా భావించలేదు కానీ ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళ అంచనాలను ఒక్కసారిగా తప్పయని తెలిపారు. అయితే ఎవరిని నిందించాల్సిన పని మాత్రం లేదు.. ప్రేమ కోసం అంత కలిసి పనిచేశాము.. విజయం అపజయం అందరికీ సమానమే అని తెలియజేశారు. అంతేకాకుండా కుమారుడితో కలిసి నటించిన మొదటి చిత్రమే ఇలా ఫ్లాప్ కావడంతో కాస్త నిరుత్సాహానికి కలిగామని తెలియజేశారు. అయితే తన కుమారుడు మాత్రం ఏ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలియజేశారు. ఎప్పటికైనా తన కొడుకుతో కలిసి మరొక సినిమా చేస్తానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: