తెలుగులో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్ లలో పూజ హెగ్డే కూడా ఒకరు. మొదట ముకుంద చిత్రంతో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ తో కలిసి దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బుట్ట బొమ్మగా పేర్కొంది వరుస క్రేజీ ఆఫర్లను అందుకుంటోంది. నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకున్నది. అయితే ఈమె నటించిన గత చిత్రాలలో రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఘోరపరాజయాన్ని చూశాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.


అలా బాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి వరుస ప్రాజెక్టులను సంపాదిస్తోంది. ఇక తెలుగులో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ ఉన్నది. ఇక ఈమె నటిస్తున్న సినిమాలోని సక్సెస్ కావాలని ఈమె అభిమానులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా కాస్మోటిక్ సర్జరీ కోసం ఈ ముద్దుగుమ్మ లండన్ కు వెళ్ళిందని సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ గా మారుతున్నాయి. తన నోస్, పెదాలకు సర్జరీ చేయించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ ప్రచారంపై ఆమె టీమ్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. పూజ హెగ్డే ఆగస్టులో వెకేషన్ కి వెళ్లినప్పుడు అందరూ తను సర్జరీ చేయించుకోని వచ్చిందనుకుంటున్నారు. అలా ఏమి జరగలేదు అవన్నీ వట్టి రూమర్లే అని తెలియజేశారు. ప్రస్తుతం పూజ హెగ్డే హైదరాబాదులో మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా  షూటింగ్ కోసం ఎదురుచూస్తోంది అని తెలియజేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈనెల రెండో వారంలో మొదలుకానున్నట్లు తెలియజేశారు పూజా హెగ్డే టీమ్ సభ్యులు. అయితే కేవలం పూజా హెగ్డే కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి వెళ్లిందని చెప్పవచ్చు. దీంతో అభిమానులకు కాస్త క్లారిటీ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: