ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుందని ఇప్పటివరకు ఎంతోమంది నటీమణులు కామెంట్ చేశారు. ఇక అవకాశాలు ఇవ్వాలి అంటే పడక గదిలోకి రమ్మంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ తో ఎంతోమంది వార్తల్లో నిలిచారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకోవాలా వద్దా అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది అంటూ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి సంబంధించిన చర్చ ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చిన అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. కొన్నేళ్ల కిందట మీటు ఉద్యమం ఎంత ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై మోహన్ బాబు దర్శకుడు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను కూడా కమిట్మెంట్ అడిగాను అంటూచెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు ఎంతో మంది దర్శకులతో పని చేశారు. ఇక ఎన్నో సూపర్ డూపర్ విజయాలను కూడా అందుకున్నారు. అయితే మోహన్ బాబు ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండే డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో సన్నాఫ్ ఇండియా అనే సినిమాను మోహన్ బాబు చేశారు అన్న విషయం తెలిసిందే.


 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆదరణ పొందలేదు. ఇకపోతే ప్రస్తుతం అన్ స్టాపబుల్ అనే ఒక ఎంటర్టైనర్ సినిమాను తీస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను హీరోయిన్స్ ని కమిట్మెంట్ అడుగుతాను అంటూ చెప్పి షాక్ ఇచ్చాడు  అయితే అది సినిమా వర్క్ విషయంలో తప్ప అందరూ అనుకునే ఆ కమిట్మెంట్ కాదని సినిమాకు పని చేసే ప్రతి ఒక్కరు కమిట్మెంట్ తోనే రావాలని ఆ కమిట్మెంట్ ఎలా ఉంటుందన్నది వారి ఇష్టానికి తగ్గట్లుగానే ఉంటుంది. ఎవరు బలవంతం చేయరని చెప్పుకొచ్చాడు రత్నబాబు. అతను చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: