కోలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించాడు హీరో ధనుష్. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు అయ్యాడు. ఎన్నో సినిమాలను తెలుగులో డబ్ చేసి మంచి విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా తెలుగులో స్ట్రైట్ గా ఒక మూవీ ని చేస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వెంకీ అట్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సార్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు ధనుష్.


ఇక అసలు విషయంలోకి వస్తే హీరో ధనుష్ తన భార్యతో విడిపోతున్నట్లు ఈ ఏడాది మొదట్లో ప్రకటించడం జరిగింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఇక ధనుష్ అభిమానులు ఒక్కసారిగా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు దాదాపుగా ధనుష్ ,ఐశ్వర్య 18 ఏళ్లగా కలిసి ఉన్నారు. అయితే వీరిద్దరూ విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది అయితే.. వీరి అభిమానులు మాత్రం వీరు తిరిగి కలిస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా అదే నిజం కాబోతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

తాజాగా వీరిద్దరూ కలగబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ధనుష్, ఐశ్వర్య మధ్య మనస్పర్ధలు తొలగించేందుకు కొంతమంది పెద్ద మనసులు వారి సమస్యలను కూడా పరిష్కరించినట్లుగా సమాచారం. ఇక రజనీకాంత్ ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో చర్చలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఏది ఏమైనా ధనుష్,ఐశ్వర్య కలవబోతున్నారని విషయం తెలియగానే అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు. మరి ఈ విషయం నిజమో కాదో తెలియాలి అంటే ఈ విషయంపై ధనుష్ ఐశ్వర్య ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: