బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జబర్దస్త్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి స్టార్ యాంకర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా వ్యవహరించారు. నటుడిగా, హీరోగా, కమెడియన్ గా, డాన్సర్ గా ఇలా రకరకాలుగా తనలో ప్రతిభను బయటపెట్టిన సుడిగాలి సుధీర్ కు విపరీతమైన అభిమానులు కూడా ఉన్నారని చెప్పవచ్చు. బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న సుధీర్ ఒక్కసారిగా మల్లెమాల వారి కార్యక్రమాలకు దూరమవుతూ స్టార్ మా కార్యక్రమంలో సందడి చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఇక స్టార్ మా కార్యక్రమంలో యాంకర్ అనసూయతో కలిసి సూపర్ సింగర్ జూనియర్స్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన ఈయన ఈమధ్య కనిపించడం లేదనే వార్త వైరల్ గా మారింది. ఇకపోతే మల్లెమాల వారి కన్నా స్టార్ మా వారు పెద్ద ఎత్తున పారితోషకం చెల్లించడంతో సుధీర్ మల్లెమాల వారి కార్యక్రమాలను వదిలి స్టార్ మా కు ఎంట్రీ ఇచ్చారు.  అయితే ప్రస్తుతం స్టార్ మా లో సూపర్ సింగర్ జూనియర్ కార్యక్రమం పూర్తి అవడంతో ఇక స్టార్ మా ఏ ఇతర కార్యక్రమాలను నిర్వహించలేదు.  ఇక ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఈ వార్త సుధీర్ అభిమానులను ఎంతగానో ఆవేదనకు గురి చేసింది.

కానీ స్టార్ మా త్వరలోనే ఒక భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నామని ఆ ఈవెంట్ మొత్తం సుధీర్ పైన ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.  ఇక త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతోందట. ఇక ఈ కార్యక్రమం ద్వారా సుదీర్ ఎప్పటిలాగే ప్రేక్షకులను సందడి చేయబోతున్నారని తెలియడంతో సుదీర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లెమాల వారి కార్యక్రమాల నుంచి సుడిగాలి సుదీర్ బయటకి వచ్చి పెద్ద మిస్టేక్ చేశారని చెప్పాలి. ఎందుకంటే స్టార్ మా లో ఒకటో రెండో ప్రోగ్రామ్ లు మాత్రమే  ఉంటాయి. కానీ ఈటీవీలో ఎప్పుడు ప్రోగ్రామ్లతో సందడి చేయాల్సింది పోయి ఇలా డబ్బుకు ఆశపడి కెరియర్ నాశనం చేసుకునే స్థితికి చేరుకుంటాడేమో అని అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం.

మరింత సమాచారం తెలుసుకోండి: