టాలీవుడ్  టాప్  హీరో  సూపర్  స్టార్  మహేష్ బాబు ఇంకా అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి28 (SSMB 28) మొదటి షెడ్యూల్ పూర్తయింది. దసరా తర్వాత ప్రారంభం కావాల్సిన రెండో షెడ్యూల్ మహేష్ తల్లి ఇందిరాదేవి గారు మరణించిన కారణంగా వాయిదా పడింది.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు.. రెండో షెడ్యూల్ లో పలువురు టాప్ స్టార్స్ మహేష్ తో పాటు చేరతారని తెలిసింది.ఇక పాన్ ఇండియా కేటగిరీలో విడుదలను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ క్యాస్టింగ్ ఎంపికలను చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇప్పుడు మలయాళ అగ్ర నటుడు అయిన పృథ్వీరాజ్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడితో చిత్రబృందం చర్చలు జరుపుతోంది. ప్రాజెక్ట్ పై అతడు సంతకం చేస్తే అధికారిక ప్రకటన వెలువడుతుంది. పుష్ప చిత్రానికి ఫహద్ ఫాజిల్ ఎలా ప్లస్ అయ్యారో అంతకుమించి పృథ్వీరాజ్ ఈ చిత్రానికి ప్లస్ అవుతాడని భావిస్తున్నారు.


పృథ్వీరాజ్ నటించిన చాలా సినిమాలు తెలుగులో అనువాదమై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ మధ్యలో ఎస్.ఎస్.ఎం.బి28 రెండో షెడ్యూల్ షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. తదుపరి షెడ్యూల్ లో అందాల కథానాయిక పూజా హెగ్డే కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ మూవీపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఇంకా రెండో షెడ్యూల్ అయినా పూర్తి కాక ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ ప్రారంభం కావడం షాకిస్తోంది. నాన్-థియేట్రికల్ హక్కుల కోసం నిర్మాతలు భారీ మొత్తాలను కోట్ చేస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2023లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్ స్టైలిష్ లుక్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: