సోషల్ మీడియా డెవలప్  అయ్యాక ఈ  ట్రోలింగ్  అనే పదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ఎంతటి సెలబ్రిటీ అయినా కానీ అస్సలు తప్పించుకోలేరు. ట్రోలర్లికి అందరూ సమానమే అన్న తీరున  వారు ఒక రేంజ్ లో చెలరేగుతుంటారు.ప్రపంచంలో ఎంత పెద్ద స్టార్  అయినా  ట్రోలింగ్  మాత్రం పతాక స్థాయిలో ఉంటుంది. ఒక హీరో  ఫ్యాన్స్  ఇంకో హీరో  ఫ్యాన్స్ ని ట్రోల్ చెయ్యడం  చాలా సాధారణం అయిపోయింది.తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్  స్టార్  పవన్  కళ్యాణ్ సైతం ట్రోలర్లకి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ `హరి హర వీరమల్లు` వర్క్ షాపు లో పాల్గొన్న ఫిక్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అందులో పవన్ రెడ్ కలర్ టీషర్ట్..జీన్స్ ప్యాంట్..బ్రాండెడ్ షూస్..వాచ్ ధరించి కనిపించారు.అయితే ఇప్పుడా యాక్సరసీస్  అనేవి పవన్ ని చాలా ఇరకాటంలో నెట్టాయి.


ఈఎమ్ఐ కట్టడానికి డబ్బులేవ్ అని చెప్పిన పవన్ కి ఇలాంటి ఖరీదైన వస్తువులు ఎలా వచ్చాయి? అంటూ ట్రోలర్లు పవన్  పై  ఎటాకింగ్ కి దిగారు. ఆయన వేసుకున్న వాచ్ ఖరీదు 14 లక్షల 37 వేలు.. షూస్ 10 లక్షలు ధర చేస్తాయి. వాటి తాలుకా ఖరీదు వివరాలు సైతం పోస్ట్ చేస్తున్నారు. వారు చూపిస్తున్న ఫోటోలో షూస్ ధర 119 యూరోస్ అని ఉంది. ఆ లెక్కన చూస్తే వాటి ధర 10 లక్షల రూపాయలకి పైనే ఉంటుంది.పవన్ ని బాగా ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో వచ్చిన ఫండ్ తో ఇలాంటి జల్సాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్స్ గా దూసుకుపోతున్న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో  హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని AM రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: