ప్రముఖ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ఎప్పటి కప్పుడు ప్రేక్షకుల ముందుకు మంచి మంచి కంటెంట్ ని తీసుకువస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన తమ 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో ఈ మధ్య కాలంలో థియేటర్ లలో విడుదలైన రెండు సినిమా లను విడుదల చేయనున్నట్లు తాజాగా ఆహా ఓ టి టి' ప్లాట్ ఫామ్ నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయబోతున్న ఆ రెండు సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.
 
సునీల్ ,  అనసూయ ప్రధాన పాత్రల్లో సలీం మాలిక్ దర్శకత్వంలో దర్జా అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో దసరా పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ సంస్థ తాజాగా ప్రకటించింది. ఆశిష్ గాంధీ హీరోగా చిత్ర శుక్ల హీరోయిన్ గా ఉనికి అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి రాజ్ కుమార్ బాబి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన దసరా పండుగ సందర్భంగా ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aha