టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఉప్పెన మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. హీరో గా ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే 100 కోట్ల కు పైగా కలెక్షన్ లను సాధించాడు. అలాగే ఈ మూవీ తో అద్భుతమైన క్రేజీ ను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పంజా వైష్ణవ్ తేజ్ సంపాదించు కున్నాడు.

ఇది ఇలా ఉంటే పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా రంగ రంగ వైభవంగా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో పంజా వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటించగా ,  గిరిసయ్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించడంతో టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రంగ రంగ వైభవంగా సినిమా 3.81 కోట్ల షేర్ , 7.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను మాత్రమే వసూలు చేసింది. దానితో ఈ మూవీ 5.19 కోట్ల నష్టాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని డబల్ డిజాస్టర్ మూవీ గా  నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: