యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయినటు వంటి కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది.

ఈ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ ప్రారంభం కాక ముందే ఈ మూవీ పై అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇది వరకే జూనియర్ ఎన్టీఆర్ ,  కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా. ఎన్టీఆర్ 30 వ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోయేది ఫలానా ముద్దుగుమ్మ అని ఇప్పటికే అనేక మంది పేర్లు తెరపైకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

కాకపోతే మొదటి నుండి రష్మిక మందన మరియు కీర్తి సురేష్ ల పేర్లు మాత్రం ఎక్కువ శాతం వినపడుతూ వచ్చాయి. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే ఎన్టీఆర్ 30 వ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం రష్మిక మందన లేదా కీర్తి సురేష్ వీరిద్దరిలో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఎన్టీఆర్ 30 వ మూవీ లో రష్మిక మందన లేదా కీర్తి సురేష్ లలో ఎవరో ఒకరు హీరోయిన్ నటిస్తారా ... లేక వేరే ముద్దుగుమ్మ నటిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: