టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రష్మిక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె టాలీవుడ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలోని అమితాబ్ బచ్చన్ తో కలసి నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడించింది. ఇక ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన స్వయంవరంలో ఎవరెవరు ఉండాలో చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ.. సారా అలీ ఖాన్ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది..


ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో భాగంగా మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలని కోరుకుంటున్నారు అని యాంకర్ అడిగినప్పుడు .. రష్మిక మాట్లాడుతూ.. ప్రస్తుతం నేను వర్క్ చేస్తున్న హీరోస్ ఉండాలి.. అందులో విజయ్ తలపతి, అల్లు అర్జున్,  రణబీర్ కపూర్ ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. అలాగే జీలే జరా వంటి సినిమాలలో అవకాశం వస్తే ఆలియా భట్,  సమంతతో కలిసి నటించాలని ఉంది అని కూడా చెప్పుకొచ్చింది. ఇక అంతేకాదు కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ గురించి సారా అలీ ఖాన్ , జాన్వి కపూర్ చేసిన కామెంట్స్ చూసినప్పుడు రియాక్షన్ ఏమిటి అని అడగగా .. పెద్దగా నవ్వేశాను అంటూ ఆమె తెలిపింది.

ఇక విజయ్ దేవరకొండ ను కలిసిన ప్రతిసారి బ్యాడ్మింటన్ ఆడతానని చెప్పిన ఈమె విజయ్ దేవరకొండ తో స్పెషల్ అట్రాక్షన్ ఉందని కూడా తెలిపింది.  ఇక అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కి పెద్ద అభిమానిని, ఎప్పటికైనా అతనితో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: