వెండితెరపై ఎవర్ గ్రీన్ క్యారెక్టర్ అయిన రాముడు. సినిమా పుట్టినప్పటి నుండి వందల చిత్రాలు అనేక భాషల్లో రామాయణం ఆధారంగా తెరకెక్కాయి.


వాల్మీకి రాసిన రాముని చరిత సినిమాటిక్ సబ్జెక్టు. ఎమోషన్, డ్రామా, లవ్, యాక్షన్ కలగలిసిన జనరంజక కావ్యం. వివిధ దర్శకులు తమ టాలెంట్ ఆధారంగా రామాయణానికి వెండితెర రూపం ఇచ్చారు. కొందరు సక్సెస్ అయ్యారు, కొందరు ఫెయిల్యూర్ కూడా అయ్యారు. తెలుగులో ఎన్టీఆర్ లవకుశ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన చిత్రం. ఇప్పటికీ ఆ సినిమా అంటే పడిచచ్చే ప్రేక్షకులు ఎందరో…


రామాయణాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కించే సాంకేతికత మనకిప్పుడు అందుబాటులో ఉంది. మరి ఈ తరంలో ఓ స్టార్ హీరోతో రామాయణం తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది? అనేదానికి సమాధానం ఆదిపురుష్. ఈ రోజుల్లో మైథలాజికల్ చిత్రాలు ఈ జెనరేషన్ ఆడియన్స్ కి నచ్చేలా తెరకెక్కించాలంటే సామాన్యమైన విషయం అయితే కాదు. వాళ్ళ ఊహలను దాటి దర్శకుడు ఆలోచించాలి.


నేడు ఆదిపురుష్ టీజర్ విడుదల కాగా దర్శకుడు ఓం రౌత్ చాలా వరకు సక్సెస్ అయ్యారనిపిస్తుంది. ఆదిపురుష్ టీజర్ మనం గమనించినట్లైతే ఆయన కొన్ని సంప్రదాయాలు బ్రేక్ చేశారు. ముఖ్యంగా రాముడు, రావణాసురుడు లుక్స్ సరికొత్తగా ఉన్నాయి. రామాయణంలో రాముడికి మీసం ఉంటుందనే కాన్సెప్ట్ లేదు. కానీ ఆదిపురుష్ లో ప్రభాస్ కి దర్శకుడు కోరమీసం పెట్టాడు. ఇక రావణాసురుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ హెయిర్ కట్ మరొక భిన్నమైన అంశం.


సైఫ్ అలీ ఖాన్ మోడ్రెన్ రావణాసురుడిని తలపించాడు. రాముడు, రావణాసురిడి కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఆయన కొత్తగా నే ఆలోచించాడు. సాధారణంగా రావణాసురుడు అంటే పంచె కట్టు, కిరీటం, ఒంటి నిండా నగలు,చేతిలో కత్తి వంటి ఆయుధం కలిగి ఉంటాడు. ఆదిపురుష్ రావణాసురుడు గెటప్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అలాగే సినిమాలో యుద్ధ సన్నివేశాలు పాళ్ళు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాటన్నింటినీ దాదాపు సీజీలో రూపొందించారు.


షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేసిన ఆదిపురుష్ టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి అధిక సమయం తీసుకున్నారు. ప్రతి సన్నివేశంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వాడారు. మొత్తంగా ఒకటిన్నర నిమిషానికి పైగా ఉన్న టీజర్ విజువల్ వండర్ లా ఉంది. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంచనాలు పెంచేసింది. 2023 జనవరి 12న విడుదల అవుతుండగా ఫ్యాన్స్ ఆద్యంతం  కూడా ఆస్వాదిస్తారు అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: