తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటులలో ఒకరు ఆయన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించిన అల్లరి నరేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరుస పరాజయలను బాక్సా ఫీస్ దగ్గర ఎదుర్కొన్న అల్లరి నరేష్ కొంత కాలం క్రితం విడుదల అయిన నాంది మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. నాంది మూవీ తో అల్లరి నరేష్ తిరిగి మంచి ఫామ్ లోకి వచ్చాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ 'ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఆనంది ,  అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం మూవీ యూనిట్ ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ని విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటి సాంగ్ కి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించింది. ఇట్లు మరేడుపల్లి ప్రజానీకం మూవీ నుండి 'లాఛ్చిమి' అనే సాంగ్ ని అక్టోబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మరి ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం మూవీ నుండి చిత్ర బృందం చేయబోతున్న మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: