ఇష్టం సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీయ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..తన అందచందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన అందాల ముద్దుగుమ్మ శ్రియ. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నఈ అమ్మడు వైవిధ్యమైన సినిమాలు చేసేది.ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం ఓపెనింగ్స్ అందుకునేవి. ఇష్టం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీయ ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని ఇండస్ట్రీకి వచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి .


టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ అడపాదడపా నటిస్తూనే సందడి చేస్తుంది.2018లో శ్రియ శరన్ ఆండ్రీ కోస్చీవ్ అనే విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది ఇక పండంటి ఆడపిల్లలకు కూడా జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.


కూతురు రాధతో రోమ్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న సమయంలో తీసిన వీడియోను, అలాగే పాపను ఆడిస్తూ ట్రెడిషనల్‌ డ్రస్‌లో ఉన్న ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ వీడియోని చూసి నెటిజన్స్ తెగ ముచ్చట పడుతున్నారు. తాజాగా ష్యాషన్ వీక్ లో కనువిందు చేసింది.. స్టైలిష్ డ్రెస్‌లో తెగ ఊపేస్తూ నానా రచ్చ చేసింది. శ్రియని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఏమందం అమ్మడు ఇది అంటూ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే శ్రియ ఈ రష్యన్ ని పెళ్లి చేసుకునేసింది. రష్యన్ లో ఆమె తన భర్తతో చేస్తున్న హంగామాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూనే ఉంది ..త్రిపుల్ ఆర్ హిట్ తో శ్రీయ మళ్ళీ సినిమాల లో బిజీ కానుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: