ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జులాయి నుండి మొదలుకొని అలవైకుంఠపురంలో సినిమా వరకు అన్ని సూపర్ హిట్ అయ్యాయి. అయితే అందుకే వారిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఎట్టకేలకు మరో సినిమా వారిద్దరి కాంబినేషన్ లో రాబోతుంది అంటూ నిర్మాత నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు.అయితే ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లుగా తెలియజేశారని, స్వాతిముత్యం చిత్ర నిర్మాత నాగ వంశీ పేర్కొన్నాడు.

 ఇక అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్వాతిముత్యం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ త్రివిక్రమ్ తదుపరి సినిమాల గురించి అలాగే తమ బ్యానర్ లో రాబోతున్న సినిమాల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.అంతేకాదు రామ్ చరణ్ తో ఒక భారీ సినిమా ను నిర్మించాలన్నది తన డ్రీమ్ అంటూ నాగ వంశీ తెలియజేశాడు.ఇక  అదే సమయం లో త్రివిక్రమ్ గారు తన తదుపరి సినిమా ను అల్లు అర్జున్ తో చేసేందుకు సిద్ధమవుతున్నారని ఇప్పటికే స్టోరీ లైన్స్ సిద్ధంగా ఉంది అంటూ ఆయన తెలియజేశాడు.

 చిరంజీవి మరియు నాగార్జున సినిమాలకు పోటీగా తమ స్వాతిముత్యం సినిమాను విడుదల చేయడం ను సమర్ధించుకున్నాడు.ఇక ఈ  సినిమా చిన్నది అయ్యుండొచ్చు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెద్దది కనుక ఈ సినిమా ను పెద్ద స్థాయి లోనే విడుదల చేస్తామంటూ స్వాతిముత్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉంటుందని, తప్పకుండా బెల్లంకొండ సాయి గణేష్ కి ఈ సినిమా సక్సెస్ తెచ్చి పెడుతుందని నిర్మాత నాగ వంశీ నమ్మకం వ్యక్తం చేశాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: