మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం  గాడ్ ఫాదర్ మూవీ మరో మూడు రోజుల్లో  థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ మొదలుకాగా గాడ్ ఫాదర్ సినిమాకు ఫస్ట్ డే టికెట్లు దొరకడం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇకపోతే గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సీక్వెల్ ఉండొచ్చని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. అయితే గాడ్ ఫాదర్ హిందీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా చిరంజీవి ఈ కామెంట్లు చేశారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా అని మోహన్ రాజాను అడగగా మోహన్ రాజా తెలియదని సమాధానం ఇచ్చారని చిరంజీవి తెలిపారు.

కాగా లూసిఫర్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ను ఇదే విషయం అడిగితే సీక్వెల్ కథ సిద్ధంగా ఉందని వచ్చి కథ చెబుతానని మీకు ఆసక్తి ఉంటే చేయొచ్చు అని అన్నారని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే గాడ్ ఫాదర్ సక్సెస్ సాధిస్తే గాడ్ ఫాదర్2 దిశగా అడుగులు పడతాయని చెప్పవచ్చు. కాగా గాడ్ ఫాదర్2 తెరకెక్కితే చిరంజీవి, సల్మాన్ ఖాన్ ఆ సినిమాలో కూడా కలిసి నటించాల్సి ఉంటుంది. అయితే గాడ్ ఫాదర్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది.ఇకపోతే చిరంజీవి మాత్రం

 ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై భారీగా అంచనాలు పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం గమనార్హం.అయితే  గాడ్ ఫాదర్ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది.ఇక  తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మోహన్ రాజాకు తెలుగులో మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంది. కాగా మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమా కోసం తక్కువ మొత్తం పారితోషికంగా తీసుకున్నారని తెలుస్తోంది.అంతేకాదు నయనతార కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని ఉంటే బాగుండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక గాడ్ ఫాదర్1 లో ప్రేక్షకులకు రివీల్ చేయని కొన్ని పాయింట్లకు సంబంధించిన కథతో గాడ్ ఫాదర్2 ఉండనుందని బోగట్టా..!!

మరింత సమాచారం తెలుసుకోండి: