బాలీవుడ్ అందాల తార  మలైకా అరోరా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈమె  బోల్డ్ ఫోటోషూట్స్ తో నిత్యం ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తన అందంతో మరింతగా అభిమానులకు దగ్గర అయింది.ఇదిలావుంటే ఇక మలైకా అరోరా తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే  ప్రస్తుతం అందుకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే మలైకా అరోరా, ఆర్బాజ్ ఖాన్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది.  వీరికి 19 సంవత్సరాల ఆర్హాన్ ఖాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 

అయితే 2017 లో వివాహ బంధానికి స్వస్తి పలికిన ఈ జంట ఆ తర్వాత ఎవరి జీవితాలలో వారు బిజీ గా మారిపోయారు.ఇక  ముఖ్యంగా కుమారుడి కోసం స్నేహితులుగా కొనసాగుతున్నారే తప్ప వీరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ కనిపించడం లేదు..ఇదిలావుంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మాజీ భర్త గురించి అడిగినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.. మలైకా మాట్లాడుతూ ఇద్దరం విడిపోయిన తర్వాత జీవితం పట్ల అవగాహన పెరిగింది. అంతేకాదు మరింత మెరుగ్గా ఆలోచించగలుగుతున్నాము. అయితే ముఖ్యంగా ఎవరి జీవితాల్లో వారు తమకు నచ్చినట్టుగా బ్రతకడమే జీవితం..

జీవితంలో సంతోషం వెతుక్కోవాలని ఇద్దరం విడాకులు తీసుకున్నాము. ఇక ముందుగా విడాకుల ప్రపోజల్ నాదే మనసుకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ వెల్లడించింది.అయితే నిజానికి ఆర్భాజ్ చాలా మంచి వ్యక్తి.ఇక  అతను ఎప్పుడు సంతోషంగా ఉండాలి కానీ మా దారులు వేరవడంతో దూరమయ్యాము. అంతేకాదు కుమారుడితో ఆర్భాజ్ కి మంచి బాండింగ్ కూడా ఉంది .ఇక  తన నిర్ణయాలను గౌరవిస్తాడు తాను సంతోషంగా ఉంటే ఆర్భాజ్ ఆనందిస్తాడు.. మా పుత్రుడు కూడా తండ్రి అంటే ఎంతో ఇష్టపడతాడు ప్రస్తుతం అర్హాన్ విదేశాల్లో చదువుకుంటున్నాడు.. ఆర్హాన్ ఇండియాకి వస్తే మేమిద్దరం కలిసి రిసీవ్ చేసుకుంటాము అంటూ తెలిపింది. అయితే  ఆర్హాన్ విదేశాల్లో ఉన్నప్పుడు.. నాకు అర్జున్ రాంపాల్ తో ప్రేమాయణం చాలా సంతోషాన్ని ఇస్తుంది అని కూడా తెలిసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: