ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు ఇప్పుడు తన బ్యానర్ లో సినిమాలను నిర్మించడం లేదు. కానీ తన కొడుకులను హీరోగా చేసేందుకు మాత్రం పలు సినిమాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఎప్పటి నుంచో వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా మొత్తానికి స్వాతిముత్యం సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ లక్ష్మణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో హీరోయిన్ గా వర్షా బొల్లమ్మ నటించినది.


ఇక ఈ చిత్రం కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా సాగేలా కనిపిస్తోంది. డీసెంట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ గా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. ఒకవైపు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా , నాగార్జున నటిస్తున్న ది ఘోస్ట్ సినిమా రెండు సినిమాలు విడుదలవుతున్నప్పటికీ స్వాతిముత్యం సినిమాని విడుదల చేస్తున్నప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి హైప్ క్రియేట్ అవుతుంది. స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా థియేటర్లు దక్కాయి. స్వాతిముత్యం సినిమాకు మాత్రం లిమిటెడ్ థియేటర్లలో విడుదలవుతున్నది.


ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిందంటే చాలు సినిమా థియేటర్లు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే పరవాలేదు అనిపించుకున్నా.. ప్రేక్షకులను థియేటర్ వద్దకు ఎలా రప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.3.7 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు సమాచారం.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.4 కోట్ల కలెక్షన్ సాధిస్తే సక్సెస్ అయినట్లే అని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా పైన కాస్త అంచనాలు పెరిగినప్పటికీ కంటెంట్ పరంగా బాగుంటే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చిత్ర బృందం కూడా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇది కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: