తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ దర్శకులలో ఒకరు అయిన సుజిత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్ రాజా రన్ మూవీ ద్వారా సుజిత్ దర్శకుడిగా తన కెరీర్ నీ మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సుజిత్ కు కూడా అదిరి పోయే క్రేజ్ లభించింది. ఇలా రన్ రాజా రన్ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం తో ఆ తరువాత సుజిత్ కు ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అందులో భాగంగా సుజిత్ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సహో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిన సాహో సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. దానితో సాహో సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.

ఇది ఇలా ఉంటే సాహో సినిమా విడుదల అయ్యి ఇప్పటికీ చాలా కాలం అవుతున్న సుజిత్ మాత్రం తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. మధ్యలో సుజిత్ ఆ హీరోతో మూవీ చేయబోతున్నాడు ...  ఈ హీరోతో మూవీ చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు బయటికి వచ్చిన ఆ వార్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే సుజిత్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక మూవీ ని చేయబోతున్నట్లు , ఈ మూవీ షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు ,  2023 వ సంవత్సరంలో ఆ మూవీ ని విడుదల చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: