స్టార్ హీరోగా పేరు పొందాలని సుధీర్ బాబు ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ అంతగా పాపులారిటీ సంపాదించుకోలేక పోతున్నారు. సుధీర్ బాబు కెరియర్ లో ఎన్నో ప్రయోగాలు చేశారని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న హంట్ చిత్రం తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.ఇందులో తమిళ హీరో భరత్, సీనియర్ నటుడు శ్రీకాంత్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమా క్యారెక్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.


ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో డైలాగులు సైతం కాస్త కన్ఫ్యూజన్ గా ఉన్నాయని చెప్పవచ్చు.సామాన్య మనుషుల సంఘటనలు, వ్యక్తిగత జీవితం గురించి ఈ టీజర్ లో చూపించడం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో మరొకసారి సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక తనకు అనుకోకుండా ఒక కేసు వస్తుంది ఆ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు అన్నది ఈ సినిమా కథ అన్నట్లుగా ఈ టీజర్ చూస్తే కనిపిస్తోంది. ఇక హీరో శ్రీకాంత్ కూడా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గానే కనిపిస్తున్నారు.


ఇప్పటివరకు సుధీర్ బాబు కెరియర్ లో ఇలాంటి సినిమాలు నటించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సోదరి మంజుల కూడా కనిపించనుంది. ఈ చిత్రానికి దర్శకత్వం మహేష్ వ్యవహరిస్తున్నారు. భవ్య క్రియేషన్ బ్యానర్ పై విచిత్రాన్ని నిర్మించడం జరుగుతోంది. మరి ఈ సినిమాతో నైనా సుధీర్ బాబు సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: