టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు.


అయితే ఈ మధ్యకాలంలో ఈయన ఎలాంటి సినిమాలను నిర్మించకపోయిన సినిమాలకు సంబంధించిన పలు విషయాల గురించి ప్రస్తావిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారట.. బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన, లేదా ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన చేసే కామెంట్లు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.


ఇదిలా ఉండగా తాగారా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ కు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి అయితే ఈ వార్తలు విన్నటువంటి బండ్ల గణేష్ ఏకంగా యాంకర్ పై పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారట.. గతంలో బండ్ల గణేష్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ కొత్త ఛానల్ ఏర్పాటు గురించి ప్రశ్నించారు.త్వరలోనే ఛానల్ ప్రారంభిస్తున్నారు కదా అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం చెబుతూ..


 


డబ్బు వచ్చే చోటే వ్యాపారం చేయాలని ఆలోచించడంలో తప్పేముంది అంటూ సమాధానం కూడా  చెప్పారు.అంటే న్యూస్ ఛానల్లో అంత లాభాలు వస్తున్నాయని అంటూ యాంకర్ ప్రశ్నించగా మరి మీరంతా అడుక్కుతింటున్నారా అంటూ ఈయన ఓ రెంజ్ లో ఫైర్ అయ్యారట.. బండ్ల గణేష్ గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫైర్ అవుతూ చేసినటువంటి ఒక ఆడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన బండ్ల గణేష్ ఆ వాయిస్ తనదేనని బహిరంగంగా ఒప్పుకున్నారట .


 


అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నుబెదిరించినట్టు వార్తలు రావడంతో లైవ్ లోనే ఈయన మంత్రి అనిల్ కుమార్ కి ఫోన్ చేసి ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారట.. మొత్తానికి బండ్ల గణేష్ పాల్గొన్నటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా బాగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: