తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం లో రూపొందిన శాకుంతలం సినిమా నవంబర్‌ 4 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుందని అధికారికంగా ప్రకటించి, మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.శాకుంతలం సినిమా వాయిదా పట్ల సమంతా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూన్నారు.ఇకపోతే గతంలో అనుష్క తో రుద్రమదేవి సినిమాను తెరకెక్కించిన గుణ శేఖర్ ఇదే తరహాలో వాయిదాల మీద వాయిదాలు వేశాడు అంటూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.


సినిమా విడుదలై దాదాపు ఏడు సంవత్సరాలు దాటింది. ఇప్పటికి కూడా గుణశేఖర్ తదుపరి సినిమా ఇదిగో అదిగో అంటూ వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. సమంత తో శాకుంతలం సినిమా ని కొన్ని నెలల క్రితమే పూర్తి చేసిన గుణ శేఖర్ గ్రాఫిక్స్ విషయమై ఆలస్యం చేస్తున్నాడు. దిల్‌ రాజు సమర్పిస్తున్న ఈ సినిమా ను నవంబర్ 4 వ తారీఖున విడుదల చేస్తాం అనగానే సమంత ఫ్యాన్స్‌ అంతా ఖుషి అయ్యారు. కానీ విడుదల తేదీ ప్రకటించిన రెండు వారాల్లోనే.. క్షమించాలి అంటూ వాయిదా వేస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు..


విమర్శలు రావడం మాత్రమే కాకుండా వాయిదా వల్ల ఆయనకు భారీగా ఆర్థిక నష్టం కూడా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమాను ఎంతగా వాయిదా వేస్తే అంతగా సినిమా బడ్జెట్ పెరుగుతుంది అనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. సినిమా కోసం తీసుకు వచ్చిన ఫైనాన్స్ వడ్డీ అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. కనుక సినిమా ను ఎంత త్వరగా పూర్తి చేసి విడుదల చేసే అంత గా సక్సెస్ అవ్వచ్చు. ఒకవేళ సినిమా సక్సెస్ అవ్వకున్నా భారీ నష్టం మాత్రం ఉండదు అనేది విశ్లేషకుల మాట. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే శాకుంతలం సినిమాతో మళ్లీ భారీ మొత్తంలో గుణశేఖర్ నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది అంటున్నారు. నవంబర్ లో విడుదల చేయాల్సిన ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ వారికి వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది...అదే కనుక నిజమైతే కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఎప్పుడూ విడుదల చేస్తారొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: