తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది టాలెంట్ హీరోయిన్లు ఉన్నారు..అందులో అందమైన వర్ష కూడా ఒకటి..హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టగా ఆ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు ఈ ముద్దుగుమ్మ.తమిళ, మలయాళ లతో పాపులర్ అయిన వర్ష బొల్లమ్మకు తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ తో సక్సెస్ దక్కింది. ఆనంద్ దేవరకొండకు జోడీగా ఈ లో వర్ష బొల్లమ్మ నటించడం నటించింది. ఇక ఇప్పుడు స్వాతి ముత్యం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. స్టాండ్ అప్ రాహుల్ తో ఫ్లాప్ అందుకుంది.


ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన స్వాతిముత్యం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ మేరకు అమ్మడు మాట్లాడుతూ..ఈ సినిమాలో పాత్రల పరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. నేను పోషించిన భాగ్య లక్ష్మి పాత్ర ఒక స్కూల్ టీచర్. ఆ పాత్రకు తగ్గట్లు కొంచెం పెత్తనం చూపిస్తాను అని తెలిపింది. నిజాయితీగా చెప్పాలంటే ఇది మొదట సితార ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పారు. ఆ తర్వాత కథ చెప్పారు. సితార లాంటి పెద్ద సంస్థలో అవకాశం అనగానే చేయాలనుకున్నాను. అయితే కథ విన్నాక చాలా నచ్చింది. ఖచ్చితంగా చేయాలి అనిపించింది.


నాకు ఇలా సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే ఇష్టం. ఈ కథలో కొత్తదనం ఉంది. పాత్రలలో చాలా లోతు ఉంది. కథా కథనాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇక నేను ఒక చిన్న టౌన్ నుండి వచ్చాను. అక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా చిన్నది జరిగినా పెద్దది చేసి మాట్లాడతారు. మన బంధువుల కుటుంబంలో ఏదైనా జరిగితే మన మాట్లాడుకుంటాం కదా.. అలా ఒక సాధారణ కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఉంటాయి. అలాగే చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ఇప్పుడు వస్తున్న యువ హీరోలు మంచి సబ్జెక్టులతో వస్తున్నారు. నన్ను తీసుకోవడానికి అది కూడా కారణమై ఉండొచ్చు. ఈ అమ్మాయి ఇలాంటి పాత్ర కూడా చేస్తుందా అని అనుకునే లాంటి పాత్ర చేయాలని ఉంది. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని అనిపిస్తుంది అని చెప్పడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: