తాజాగా మోక్షజ్ఞ హైదరాబాదులోని AMB లో సందడి చేయడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులతో కాకుండా ఫ్రెండ్స్ తో కాకుండా కేవలం ఒంటరిగా ఆ థియేటర్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే అక్కడున్న కొందరు మాత్రం మోక్షజ్ఞను గుర్తుపట్టి ఇలా ఫోటోలు తీసేందుకు పలు ప్రయత్నాలు చేశారు. తనకు ఎదురు పడ్డ అభిమానులను పలకరించుకుంటూ థియేటర్లోకి వెళ్లిపోయాడట మోక్షజ్ఞ. ఇక మోక్షజ్ఞ AMB లో సినిమా చూసేందుకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
మోక్షజ్ఞ కోసం చాలామంది డైరెక్టర్లు సైతం కథలు వినిపిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పలువురు డైరెక్టర్లు చెప్పిన కథలను బాలకృష్ణ విన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ చెప్పిన కథకు బాలకృష్ణ ఓకే చెప్పారని వార్తలు కూడా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి త్వరలోనే అభిమానులకు ఏదైనా గుడ్ న్యూస్ చెప్పి అవకాశాలు కనిపిస్తాయేమో చూడాలి మరి. ఏది ఏమైనా గతంలో కంటే మోక్షజ్ఞ ఇప్పుడు చాలా స్లిమ్ముగా కనిపిస్తున్నారని చెప్పవచ్చు.