గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు ,  కన్నడ ,  మలయాళ , హిందీ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే కాస్త మిక్సెడ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర లభించినప్పటికీ ఆ టాక్ ప్రభావం ఈ మూవీ కలెక్షన్ లపై ఏ మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే రేంజ్ కలెక్షన్ లను రాబడుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ,  కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష  ముఖ్య పాత్రలలో నటించడం ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించడం ,  గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 10.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ నీ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.26 కోట్ల షేర్ , 15.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇంకా 2.24 కోట్ల షేర్ కలక్షన్ వసూలు చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: