మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు  సమంత ఇప్పటికే తెలుగు తమిళ ఇండస్ట్రీ లో అనేక మూవీ లలో నటించి ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకుల మనసు కూడా దోచుకుంది.

అలాగే పోయిన సంవత్సరం విడుదల అయిన పాన్ ఇండియా మూవీ పుష్ప మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత "పుష్ప" మూవీ లోని స్పెషల్ సాంగ్ లో తన అంద చందాలతో డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసి పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. దానితో సమంత కి బాలీవుడ్ నుండి కూడా అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే సమంత ఇప్పటికే శాకుంతలం ,  యశోద మూవీ షూటింగ్ లను పూర్తి చేసుకుంది. శాకుంతలం మరియు యశోద మూవీ లు మరి కొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నాయి.

ఇది ఇలా ఉంటే సమంత కు అదిరి పోయే రేంజ్ లో అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా సమంత కు మూడు ప్రాజెక్ట్ ల ఆఫర్లు వచ్చినట్లు ,  కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సమంత కొంత సమయం తీసుకొనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం కమర్షియల్ మూవీ ల కంటే కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: