కోలీవుడ్  చిత్ర పరిశ్రమలో మరో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది. స్టార్  డైరెక్టర్  మణిరత్నం దర్శకత్వంలో తెరపైకి వచ్చిన PS 1 (పొన్నియిన్ సెల్వన్ 1) సినిమా కోసం తమిళ నాడులో చాలామంది ప్రేక్షకులు విడుదల అయ్యే వరకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.మణిరత్నం తెరకెక్కించిన కళా ఖండం పొన్నియిన్ సెల్వన్ 1 మిగతా భాషల్లో ఏమో కానీ తమిళనాడులో మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే పెట్టిన పెట్టుబడికి తెలుగులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లను కూడా దాటేసింది. ఇప్పటివరకు తమిళనాడులో అత్యధిక వేగంగా 300 కోట్ల కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో రజినీకాంత్ సినిమాలతో పాటు శంకర్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే ఇటీవల కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో కూడా 300 కోట్లు కలెక్ట్ చేశాడు.


ఇక మొదటిసారి మణిరత్నం PS1 సినిమా వారం రోజుల్లో 323 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది.ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం 10 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా ఏడు రోజుల్లో కేవలం ఎనిమిది కోట్లు షేర్ కలక్షన్స్ మాత్రమే అందుకుంది. కానీ ఇంకా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరొక రెండు కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవాల్సిందే. ఏదేమైనా మణిరత్నం మాత్రం ఫస్ట్ పార్ట్ తో చాలా సింపుల్ గానే 300 కోట్లు అందుకున్నాడు.అమెరికాలో కూడా PS 1 సినిమా ఇప్పటికే నాలుగు మిలియన్లను దాటింది. ఇక ఐదు మిలియన్ మార్కును కూడా అందుకోవడానికి రెడీగా ఉంది. మరికొన్ని దేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు అయితే దక్కాయి. మరి మణిరత్నం నెక్స్ట్ పార్ట్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో ఇంకా ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS1