మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ అనే మూవీ కి రీమేగా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా , సత్య దేవ్ విలన్ పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు.

మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో , ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 9.28 కోట్లు .
సీడెడ్ : 7.35 కోట్లు .
యు ఏ : 4.07 కోట్లు .
ఈస్ట్ : 2.89 కోట్లు .
వెస్ట్ : 1.60 కోట్లు .
గుంటూర్ : 3.15 కోట్లు .
కృష్ణ : 1.93 కోట్లు .
నెల్లూర్ : 1.46 కోట్లు .
4 రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 31.73 కోట్ల షేర్ , 52.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక :  3.15 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో :  3.75 కోట్లు .
ఓవర్ సీస్ లో :  3.80 కోట్లు .
4 రోజులకు గాను ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 42.43 కోట్ల షేర్ , 77.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: