సక్సెస్ సాధిస్తే తప్పకుండా ఎవరినైనా అందలాన్ని ఎక్కిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మంచి
సక్సెస్ అందుకున్న హీరోలందరూ కూడా ఇప్పుడు మంచి డిమాండ్ అందుకుంటున్నారని చెప్పాలి. తాజాగా సీతారామం అనే సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు
హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం లో అగ్ర హీరోగా ఉన్న ఈ
హీరో తెలుగులో అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించే వాడు.
మహానటి సినిమాతో తెలుగులో తొలిసారిగా డైరెక్ట్
సినిమా చేసిన ఈ
హీరో ఆ తర్వాత ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్నాడు అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన డైరెక్ట్ గా తెలుగు లో మరో
సినిమా చేయాలని భావించడం అప్పుడే దర్శకుడు రాఘవపూడి సీతారామం
సినిమా చేయడం అది సూపర్ హిట్ అవడం జరిగింది. ఈ సినిమాతో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న
దుల్కర్ సల్మాన్ ఇప్పుడు తెలుగులో మోస్తారు
మార్కెట్ ను ఏర్పరచుకున్నాడని చెప్పాలి.
ఇటు మలయాళంలో అటు తెలుగులో రెండు భాషలలోనూ మంచి
మార్కెట్ కలిగి ఉన్న ఈ హీరోకు ఇప్పుడు తెలుగులో మంచి మంచి
సినిమా అవకాశాలు వస్తున్నాయట పెద్ద దర్శకులు సైతం ఈ హీరోతో
సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. తాజాగా ఓ అగ్ర దర్శకుడి కథకు
సల్మాన్ ఓకే చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే దీనికి సంబంధించిన క్లారిటీ వస్తుందని వినబడుతున్నాయి. మొదటినుంచి ఆయన మలయాళం లో చేసిన సినిమాలను తెలుగులో విడుదల చేసే అలవాటు ఉంది. ఆ విధంగా చిన్నపాటి
మార్కెట్ ఏర్పరచుకున్న
దుల్కర్ సల్మాన్ ఒక్కసారిగా తన సినిమాలను తెలుగులో కూడా చేయడం ఆయనకు ఇక్కడ మంచి క్రేజీ ఏర్పడింది అని చెప్పాలి మలయాళంలో అగ్ర హీరోగా ఉన్న ఈ
హీరో తెలుగులో కూడా అలాంటి స్థానాన్ని అందుకుంటాడా అనేది చూడాలి.