వెయ్యి సంవత్సరాల క్రితం నాటి చోళ సామ్రాజ్యం గురించి వచ్చిన చారిత్రక నవల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్పెషల్ ఏమంటే.. ఖచ్చితంగా భారీ తారాగణం అని చెప్పాలి. ఒకరికి మించిన ఒకరు అన్నట్లుగా నటనతో థియేటర్లో కూర్చొని సినిమా చూసే వారికి పండుగ లాగా మారిన పరిస్థితి. అయితే.. ఈ సినిమాను చూసేటప్పుడు వచ్చే చిక్కు.. నెగిటివ్ అనుకుంటే అదే ఇప్పుడు పాజిటివ్ అంశంగా మారింది.సినిమా సాగుతున్న కొద్దీ వచ్చే పాత్రలు.. వాటి పేర్లు.. వారికి మిగిలిన వారితో ఉండే లింకులు ఒక పట్టాన అర్థం కావు. కానీ.. అర్థమవుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మిగతా భాషల వారికేమో కానీ తమిళ ప్రేక్షకులు అయితే ఈ సినిమాకి బ్రహ్మ రధం పడుతున్నారు. అలాగే దీనికి తోడు ఐశ్వర్యారాయ్.. త్రిషలకు వాడిన జ్యుయులరీ మీద భారీ ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. గ్రాండ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న ఈ మూవీని చూసినంతనే కలిగే ఫీలింగ్ ఏమంటే.. మరోసారి చూస్తే.. మరింత ఎంజాయ్ చేయొచ్చని ఫీలింగ్ కలుగుతుంది.


ఇటీవల కాలంలో కనిపించని రిపీటెడ్ ఆడియన్స్ ఈ సినిమాకు వస్తున్నారు. వారి సంఖ్య తక్కువే ఉండొచ్చు. కానీ.. ఇటీవల కాలంలో సినిమాను చూసేందుకే థియేటర్ కు రాని వేళలో.. పొన్నియిన్ సెల్వం మూవీని మరోసారి చసేందుకు.. తమకు అర్థమైన పాత్రల్ని మరింతగా అర్థం చేసుకోవటానికి.. సినిమాను మరింత ఎంజాయ్ చేయటానికి రెండోసారి చూస్తే ఆ కిక్కే వేరేగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదే.. పీఎస్ కు కొత్త బలంగా మారినట్లుగా చెబుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న వసూళ్లు కూడా ఇవే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ఇక తాజాగా పొన్నియిన్ సెల్వన్ మరో సూపర్ డూపర్ రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఏకంగా 350 కోట్ల వసూళ్లు సాధించి తమిళ నాట ఆల్  టైం  ఇండస్ట్రీ  హిట్  దిశగా దూసుకువెళుతుంది. ఇక ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

PS1