మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన తారమూవీ లో కీలక పాత్రలో నటించారు  ఈ మూవీ తాజాగా అక్టోబర్ 5 వ తేదీన భారీ ఎత్తున తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల అయింది  ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే తెలుగు మరియు హిందీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ లభించింది. దానితో ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ కి తెలుగు మరియు హిందీ నుండి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది.

ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ...  ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ నటించినందుకు ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకోలేదు తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ "గాడ్ ఫాదర్" మూవీ కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకపోవడంతో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సల్మాన్ ఖాన్ కోసం అదిరి పోయే సర్ప్రైజ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుండి తెలుస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సల్మాన్ కోసం ఒక అదిరిపోయే ఖరీదు అయిన కారును గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ "గాడ్ ఫాదర్" మూవీ లో నటించడం ద్వారా బాలీవుడ్ లో కూడా గాడ్ ఫాదర్ మూవీ పై విడుదలకు ముందు నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల కు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: