మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ లో ,  సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ , నయన తార ఇతర కీలక పాత్రలో నటించారు. తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ మూవీ కి తెలుగు మరియు హిందీ నుండి అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.

హిందీ నుండి ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు వస్తూ ఉండడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించిన 600 స్క్రీన్ లను కూడా మూవీ యూనిట్ పెంచింది.  ఈ మూవీ ఇప్పటికే 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్సా ఫీస్ దగ్గర సాధించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తున్న ఈ మూవీ ని తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ చూశారు. అది మాత్రమే కాకుండా గాడ్ ఫాదర్ మూవీ పై సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రశంసల వర్షం కూడా కురిపించాడు.

మూవీ ని చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలను గాడ్ ఫాదర్ మూవీ దర్శకుడు మోహన్ రాజా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. గాడ్ ఫాదర్ మూవీ అద్భుతంగా ఉంది ... చాలా బాగుంది ... ఆసక్తికరంగా ఉంది అని సూపర్ స్టార్ రజనీ కాంత్ తెలియజేసినట్లు దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: