తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్య. ఎప్పుడు కమర్షియల్ రోల్స్ మాత్రమే చేయకుండా విభిన్నమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే కాలంలో సూర్య నటించిన ఒక చిన్న పాత్ర ప్రేక్షకులను మాత్రం ఎంతగానో ప్రభావితం చేసింది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లోకనాయకుడు కమలహాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం విక్రమ్. అయితే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించి తమ నటనతో మెప్పించారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా అంటే ఇలా ఉండాలి అనే భావన మదిలో కలిగింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తైతే చివర్లో కొన్ని నిమిషాల పాటు సూర్య కనిపించే రోలెక్స్ పాత్ర మరో ఎత్తు. ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించిన సూర్య ఒక్కసారిగా సినిమాపై హైప్ పెంచేసాడు. ఇకపోతే ఈ పాత్ర గురించి ఇటీవల అవార్డు ఫంక్షన్ లో మాట్లాడాడు సూర్య.


 సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా  అనే సినిమాలోని పాత్రకు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా రోలెక్స్ పాత్ర గురించి సూర్య మాట్లాడుతూ.. ఈరోజు నేనేం చేసినా జీవితంలో ఈ స్థాయిలో ఉండడానికి కమల్ హాసన్ సార్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. ఫోన్ చేసి ఒక పాత్ర ఉందని చెప్పినప్పుడు వదులుకోవాలనిపించలేదు. అయితే ఆయనతో నటన మాత్రం భయపెట్టింది. అయితే భయపెట్టిన పనిని చేస్తేనే ఎదుగుదల అని నమ్ముతాను. అందుకే చివరి నిమిషంలో రోలెక్స్ పాత్ర చేయాలని నిర్ణయించుకున్న. మొదట లోకేష్ కనకరాజుకు ఈ పాత్ర చేయనని చెప్పాలనుకున్న.. కానీ చేశాను. కేవలం లోకనాయకుడు కమలహాసన్ కోసం మాత్రమే అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: