మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. చిరంజీవి మొదటగా ఈ సంవత్సరం ఆచార్య మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆచార్య మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి "గాడ్ ఫాదర్" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ మలయాళం లో అద్భుతమైన విజయం సాధించిన లూసీఫర్ అనే మూవీ కి రీమిక్ గా తెరకెక్కింది.  గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తార ఇతర ముఖ్య పాత్రలో నటించారు. 

మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ,  ప్రస్తుతం ఈ సినిమాకు తెలుగు మరియు హిందీ భాషల నుండి అద్భుతమైన కలెక్షన్ లు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "తార్ మార్" అనే సాంగ్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ కి తమన్ అద్భుతమైన ట్యూన్ ను అందించగా ,  చిరంజీవి.  సల్మాన్ ఖాన్ తమ డాన్స్ స్టెప్ లతో ఈ సాంగ్ కి మరింత జోష్ ని తీసుకువచ్చారు. దాంతో "తార్ మార్" సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సాంగ్ ఫుల్ వీడియోని ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: