మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీకి, అల్లు అరవింద్‌ ఫ్యామిలీకి మధ్య విభేదాలు తలెత్తాయనేది చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.చిరంజీవి సొంతంగా టాలీవుడ్‌లోకి వచ్చి మెగాస్టార్‌గా ఎదిగిన విషయం తెలిసిందే. అప్పటికే అల్లు రామలింగయ్య సీనియర్‌ నటుడిగా, కమెడీయన్‌గా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలో పాతుకుపోయారు. అలాంటి టైమ్‌లో అప్పుడప్పుడే చిరంజీవిలోని ప్రతిభని గుర్తించిన అల్లు రామలింగయ్య భవిష్యత్‌లో చిరు పెద్ద స్టార్‌ అవుతాడని ఊహించిన, ఆయన ప్రవర్తన నేపథ్యం నచ్చి అల్లుడిని చేసుకున్నారు.

అలా అటు అల్లు ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ విస్తరిస్తూ వచ్చింది. చిరంజీవికి మెగాస్టార్‌ ఇమేజ్‌ పెరిగిపోవడంతో అల్లు ఫ్యామిలీ సైతం మెగా ఫ్యామిలీ కుటుంబంలోనే భాగమైపోయిందనే భావన అందరిలోనూ కలుగుతూ వస్తుంది. కానీ రెండు బలమైన కుటుంబాలే అని సుస్పష్టం. అయితే ఇటీవల కాలంలో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తలెత్తాయనే టాక్‌ వినిపిస్తుంది.

బన్నీ పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదగడంతో, మెగా ఫ్యామిలీలోనూ వరుసగా హీరోలు సినీ రంగంలోకి రావడంతో రెండు కుటుంబాల మధ్య పోటీ పెరిగిందని, ఇది విభేదాలకు కారణమైందనే కామెంట్లు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విభేదాలపై మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ స్పందించారు. ఇప్పటికే ఆయన పలు మార్లు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు మరోసారి స్పష్టం చేశారు.

ఓ ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌కి ఈ ప్రశ్న ఎదురుకాగా ఆయన చెబుతూ, చిరంజీవి, తాను 80 నుంచి స్నేహితులమని చెప్పారు. స్నేహితులుగా ఉంటూనే కెరీర్‌ పరంగా ఎదుగుతూ వచ్చామన్నారు. చిరు, తాను బావబావమరుదులుగా కాకుండా ఫ్రెండ్స్ గానే ఎదిగామన్నారు అల్లు అరవింద్‌. అలా తమ కుటుంబాలు కూడా ఎదుగుతూ వచ్చాయని, పిల్లలు వచ్చారు, వారు కూడా ఇదే రంగంలో స్థిరపడటంతో మరింత పెరిగిందన్నారు.

చిత్ర పరిశ్రమలో అవకాశాలను పంచుకోవాలని, ఎవరి స్థానాలను వారు కాపాడుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే పోటీ ఉంటుందన్నారు. అయితే ఎంత పోటీ ఉన్నా అది కెరీర్ పరంగానే కానీ, ఫ్యామిలీల పరంగా కాదని స్పష్టం చేశారు అల్లు అరవింద్‌. అందరూ ఆ విషయాల్లో ఒకే మాట మీద ఉంటారని చెప్పారు. సంక్రాంతి పండుగ వస్తే తమ ఇంట్లో నాన్నగారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరం చిరంజీవి ఇంటికి చేరతామని తెలిపారు అరవింద్‌.

దీపావళి పండుగ రోజున కూడా అందరం కలిసి చిరంజీవి ఇంట్లో సరదాగా సెలబ్రేట్‌ చేసుకుంటామని, కొన్నేళ్లుగా ఇది జరుగుతుందన్నారు. మేమంతా కలిసి పండుగలు సెలబ్రేట్‌ చేసుకుంటామని వీడియోలు తీసి చూపించాలా? అలా పెట్టలేం కదా. కాంపిటీషన్‌లో ఎవరికి వాళ్లు పైకి వస్తున్నారు. కానీ వీరంతా ఒక్కటే` అని క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్‌. ఆయన నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌ బిగ్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌(గీతా ఆర్ట్స్)ని నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు అల్లు రామలింగయ్య పేరుతో ఫిల్మ్ స్టూడియోని కూడా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: