పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్  నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్ మీద ఎన్నెన్నో ట్రోల్స్, మీమ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. అంతేకాదు ఏ ఒక్కరూ కూడా ప్రభాస్ ఆదిపురుష్‌ టీజర్ మీద సంతృప్తిని వ్యక్తం చేయలేదు.ఇకపోతే ఈ మూవీ మొబైల్ యూజర్ల కోసం కాదని, త్రీడీ స్క్రీన్లలో చూడాలని, అప్పుడు తేడా తెలుస్తుందని ఓం రౌత్ అన్నాడు.అయితే ఇక  కొన్ని చోట్ల త్రీడీ స్క్రీన్లలో ఆదిపురుష్‌ టీజర్‌ను ప్లే చేసి చూపించారు. అయితే మొబైల్లో చూపించిన దానికీ, త్రీడీలో చూసిన దానికి చాలా తేడా ఉందని అన్నారు. అయితే ఇక  త్రీడీలో చూసినా కూడా గెటప్స్ అయితే మారవు కదా? లుక్స్ మారవు కదా? 

అని ఇంకొందరు అన్నారు.అంతేకాదు రాముడు అలా ఉంటాడా? అలాంటి వస్త్రాలు ధరిస్తాడు?ఆంజనేయుడు తోలు వస్త్రాలు ధరిస్తాడా? రావణుడు అలా ఉంటాడా? అంటూ ఇలా అందరూ ఆదిపురుష్ టీం మీద విరుచుకుపడుతున్నారు.ఇక  ఆల్రెడీ మధ్య ప్రదేశ్ హోం మినిస్టర్ కూడా మండిపడ్డాడు. అంతేకాదు వెంటనే ఆ సీన్లను తొలగించమని హెచ్చరించాడు. ఢిల్లీలో ఆల్రెడీ ఆదిపురుష్‌ టీం మీద కేసు వేశారు. అయితే మళ్లీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఇక ఆదిపురుష్‌ టీం, ప్రభాస్, ఓం రౌత్‌ల మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.కాగా జాన్పూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశుతోష్ సింగ్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

ఇక  అడ్వకేట్ హిమాన్షు శ్రీవాస్తవ చేసిన ఫిర్యాదు మేరకు ప్రభాస్, ఓం రౌత్, సైఫ్ అలీ ఖాన్ ఇలా అందరి మీద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అయితే అక్టోబర్ 27న విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.ఇక  సీతారాములు, హనుమాన్, రావణుడిని చూపించిన తీరుతో మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ చెప్పుకొచ్చాడు.ఇక అలా అదిపురుష్ టీం మీద రోజూ ఎక్కడోచోట.. ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. అయితే ఆదిపురుష్ టీం మాత్రం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.ఇకపోతే  వీఎఫ్‌ఎక్స్ కూడా మొత్తం మార్చబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే  ఇక ఆదిపురుష్‌ మీద మాత్రం ఇప్పుడు పూర్తి నెగెటివ్ టాక్‌తోనే సతమతమవుతోంది.  రిలీజ్ టైంకు ఆదిపురుష్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: