ఆర్జీవీ ఎప్పుడు..ఎలా బిహేవ్‌ చేస్తారో ఎవ్వరికీ తెలీదు.ఇక  రాంగోపాల్‌ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.ఇకపోతే తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. అయితే ఒకప్పుడు తన లతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు రొటిన్ చెత్త లతో వార్తల్లో నిలుస్తున్నారు. అంతేకాదు ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ పోస్ట్  చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. ఇదిలావుండగా తాజాగా ఈయన తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీ తీస్తున్నట్టు ప్రకటించారు.ఇక  2019లో కూడా టైగర్ కేసీఆర్ అంటూ ఓ బయోపిక్‌ను అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత కామ్ అయిపోయారు.

అయితే  తాజాగా ఈయన దర్శకత్వం వహించిన 'డేంజరస్' మూవీ ప్రమోషన్‌లో భాగంగా మరోసారి సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీపై తన మనసులతో మాట బయట పెట్టారు.పొలిటికల్ బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన తోపు దర్శకుడు లేరు. అంతేకాదు ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ చిత్రాలకు సంబంధించిన బయోపిక్స్‌ను తీయడంలో వర్మను మించినోడు లేడంటూ ఆయన ప్రత్యర్ధులు అంటుంటారు.ఇకపోతే  గతంలో రామ్‌గోపాల్ వర్మ ఏదైనా సంఘటన జరినపుడు దానికి సంబంధించిన చరిత్రను తీస్తున్నట్టు ప్రకటించడం ఆయన అలవాటు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఇష్టం ఉంటే ఆ ను తెరకెక్కిస్తారు.జనరల్‌ ఎలక్షన్ల ముందు 'లక్ష్మీస్ ఎన్టీఆర్', ఆ తర్వాత 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' లతో సంచలనం రేపారు. అయితే ముందుగా ఈ కు కమ్మరాజ్యంలో కడప రెడ్లు అంటూ కులాన్ని సంబోధిస్తూ ను తెరకెక్కించారు. ఇక ఆ తర్వాత టైటిల్ ఛేంజ్ చేసి రిలీజ్ చేస్తే అంతగా వర్కౌట్ కాలేదు.

అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై 'టైగర్ కేసీఆర్' అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా..ఈ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు.  కేసీఆర్‌కు తెలుగు ప్రజలంటే ప్రేమ ఉంది.అయితే  ఆయన పోరాట మంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే అంటూ వివరణ ఇచ్చాడు. ఈ కు అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు 'ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.ఈ  సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం మరో రంగస్థల నటుడిని ఎంపిక చేయాలనుకున్నట్టు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.ఇక  ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై 'ఉద్యమ సింహం'తో పాటు శ్రీకాంత్ హీరోగా 'తెలంగాణ దేవుడు' టైటిల్స్‌తో లు కూడా తెరకెక్కాయి.  ఈ లేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి.  రామ్ గోపాల్ వర్మ.. కేసీఆర్ బయోపిక్‌లోని ఏ యాంగిల్‌ను తీసుకొని తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.  చెప్పినట్టే.. ఆర్జీవి ఈసారైనా కేసీఆర్ బయోపిక్‌ను అనుకున్నట్టే తెరకెక్కిస్తారా లేకుండా పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: