మెగాస్టార్ చిరంజీవి తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా ,  సల్మాన్ ఖాన్ ,  సత్య దేవ్ ,  నయన తారమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , సత్య దేవ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ లో విడుదల అయింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ లభించడంతో ,  ఈ మూవీ కి తెలుగు మరియు హిందీ భాషల నుండి మంచి కలెక్షన్ లు వచ్చాయి. ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ 9 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ను విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. మరి ఈ 9 రోజుల్లో గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 11.81 కోట్లు .
సీడెడ్ : 9.13 కోట్లు .
యు ఏ : 5.49 కోట్లు .
ఈస్ట్ : 3.53 కోట్లు .
వెస్ట్ : 2.15 కోట్లు .
గుంటూర్ : 3.79 కోట్లు .
కృష్ణ : 2.56 కోట్లు .
నెల్లూర్ : 1.93 కోట్లు .
9 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ మూవీ 40.39 కోట్ల షేర్ , 66.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటకలో : 4.57 కోట్లు .
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 4.70 కోట్లు .
ఓవర్ సీస్ లో :  4.87 కోట్లు .
9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 54.53 కోట్ల షేర్ , 99 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: