సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా ఉత్తరాది ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమెను అసలు పేరు కంటే సీత అనే పేరు బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు. బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించినప్పటికీ దక్కని గుర్తింపు కేవలం ఈ ఒక్క సినిమాతోనే ఈమెకు భారీ స్థాయిలో పాపులారిటీ సంపాదించేలా చేసింది. సుదీర్ఘకాలంగా పలు టీవీ సీరియల్స్ లో చేస్తూ పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా పాపులారిటీ సంపాదించింది. ముఖ్యంగా సీతారామం చిత్రం విడుదలైన తర్వాత ఈమెకు మరింత పాపులారిటీ పెరిగిందని చెప్పవచ్చు.
ఇదంతా పక్కన పెడితే సీతారామం చిత్రంలో సీత పాత్రలో చాలా పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్లతో ప్రేక్షకులను సైతం రెచ్చగొడుతున్నది. వాటిలో కొన్ని ఫోటోలు అభిమానులు విమర్శిస్తుంటే మరి కొన్ని ఫోటోలు మాత్రం చాలా బాగున్నాయంటూ కామెంట్లు చేయడమే కాకుండా షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చీరకట్టులో ఈమెను చూసిన ప్రేక్షకులు మోడ్రన్ దుస్తులలో చూసేందుకు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.

 తాజాగా ఒక ఫ్యాషన్స్ ఈమె పాల్గొన్న సందర్భంగా ధరించిన కాస్ట్యూమ్స్ ఇమే అన్ని విభాగాలలో బాగుంది అనే ప్రశంసలు దక్కించుకుంటోంది. హీరోయిన్గా ఇప్పటికే స్టార్డం సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అతి త్వరలోనే సౌత్ లో బిజీ హీరోయిన్గా మారిపోయే అవకాశం ఉందని ఆమె అభిమానులు సైతం భావిస్తున్నారు. కేవలం సీత పాత్రలోనే కాకుండా ఇలా మోడల్ గా విభిన్నమైన కాస్ట్యూమ్స్ తో కూడా మృణాల్ ఠాగూర్ బాగుందని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజులలో టాలీవుడ్ లో సౌత్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదిస్తుందని నమ్మకాన్ని కొంతమంది తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: