బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ ను ఈ బ్యూటీ పెళ్లి చేసుకున్న విషయం  మనకు తెలిసిందే. ఆ వెంటనే ప్రెగ్నెన్సీని ప్రకటిస్తూ స్టార్ కపుల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.

 
ఇటీవలనే ఇరు కుటుంబ సభ్యులు అలియా భట్ సీమంతం ఫంక్షన్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. అలియా కూడా నెలలు నిండుతుండటంతో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ తన ఆరోగ్యం పై మరింత శ్రద్ధ వహిస్తోంది. సౌకర్యవంతమైన ఏర్పాట్లతో రెస్ట్ తీసుకుంటోంది.

 
ఈ క్రమంలో అలియా కడుపులోని బిడ్డకు, తనకూ కంఫర్ట్ గా ఉండేలా ఇంట్లోని ఫర్నీచర్ ను ఏర్పాటు చేసుకుంది. అలాగే దుస్తులను  కూడా డిజైన్ చేయించుకుంది. ఇదే విషయాన్ని తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించింది. కేవలం తనకోసమే కాకుండా పుట్టబోయే బిడ్డకూ సౌకర్యంగా ఉండేలా ప్రతి విషయంలో సెల్ఫ్ కేర్ తీసుకుంటోంది.

 
తాజాగా అలియా సౌకర్యవంతమైన బ్లాక్ అవుట్ ఫిట్స్ లో బేబీ బంప్ ను చూపిస్తూ దర్శనమిచ్చింది. తన ఇంట్లోని అత్యంత అల్ట్రా కంఫర్ట్ గల లాంజ్ సెట్‌లో విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. స్వీయ-సంరక్షణతోనే ప్రశాంతత పొందుతున్నట్టు తెలిపింది. ప్రెగ్నెన్నీ విమెన్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులు ధరించినట్టు తెలిపింది.

 
ఇక రీసెంట్ గా అలియా భట్ - రన్బీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'బ్రహ్మస్త' ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం  మనకు తెలిసిందే. స్టార్ కపుల్ జంటగా అలరించడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో అలియా, రన్బీర్ కు కొత్త ఉత్సాహం లభించింది.

 
'ఆర్ఆర్ఆర్'తో అలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన అలియా తన పెర్పామెన్స్ తో ఆకట్టుకుంటుంది. తన పెళ్లి వార్తలు తెరపైకి రాకుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కూడా 'ఎన్టీఆర్ 30'లో నటించేది అలియా. ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు చాలా దూరంగా ఉంటోంది అలియా..

మరింత సమాచారం తెలుసుకోండి: