గత సంవత్సరం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా అలాగే ఈ ఏడాది నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమాలు రెండు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ హిట్ పాయింట్ దైవత్వం. నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో శివ తత్వాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేయగా కార్తికేయ 2 సినిమాలో కృష్ణ తత్వాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్స్ .ఇంకా అలాగే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో కూడా దాదాపు ఇలాంటి ప్రయత్నం జరుగుతోందని సమాచారం వినిపిస్తోంది. సలార్ సినిమాలో డివోషనల్ టచ్ ఉంటుందని, కాళి మాత ప్రస్తావన సహా కాళీ మాత్ర విగ్రహం చుట్టూ కాసేపు కథ తిరుగుతుందని అంటున్నారు. ఉగ్రం సినిమాతో డైరెక్టర్ గా మారి కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఈ సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.


శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాల స్టార్ హీరో పృథ్వీరాజ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వరదరాజ మన్నార్ అనే ఒక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో భాగంగా ఒక కాళికామాత విగ్రహం చుట్టూ కాస్త కథ అల్లుకున్నారని ఆ కథ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుందని కచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులందరూ సినిమాను ఆదరిస్తారని మేకర్స్ భావిస్తున్నారు.వరుస హిట్లతో మంచి ఊపుమీదున్న హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ మీద ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతుందనే ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగానే ప్రభాస్ లుక్ అలాగే తాజాగా విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రెండూ కూడా దాదాపు బొగ్గులా ఉండటంతో ఏదో కొత్తగా ప్లాన్ చేశారని అర్ధం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: