మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అద్భుతమైన టాలెంట్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. సత్య దేవ్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తారమూవీ లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది. ఈ మూవీ అక్టోబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ తెలుగు మరియు హిందీ భాష లలో విడుదల అయింది. ఈ మూవీ లో సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటించడంతో , ఈ మూవీ పై హిందీ సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే తెలుగు మరియు హిందీ లో భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయిన గాడ్ ఫాదర్ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  ఈ 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ మూవీ 56.92 కోట్ల షేర్ , 103.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా గాడ్ ఫాదర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతాన్ని అందించాడు. తమన్ సంగీతం కూడా ఈ మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: