మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమన్నా ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది. తమన్నా ఇప్పటికే ఈ సంవత్సరం వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 మూవీ లో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. అలాగే తాజాగా ఈ ముద్దు గుమ్మ సత్య దేవ్ సరసన గుర్తుందా సీతాకాలం అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. అలాగే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్న పెళ్లి మరియు పిల్లలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నే మాట్లాడుతూ ... నేను పెళ్లికి వ్యతిరేకిని కాదు అని ,  ఇన్నాళ్లు కూడా సినిమాల బిజీలో పడి ఆలోచించ లేదు అని  , త్వరలోనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాను అని చెప్పు కొచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా "బాబ్లీ బౌన్సర్" అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ నేరుగా డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తమన్నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా , ఇతర ముఖ్యమైన పాత్రలలో ,  ఐటెం సాంగ్ లలో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: