టాలీవుడ్ లో అన్నాదమ్ముల అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో అన్నయ్య చిరంజీవి అడుగుజాడల్లో తమ్ముళ్లు నాగబాబు, పవన్ లు నడుస్తారు.
అయితే చిరంజీవి, పవన్ లను ఒక ఫ్రేమ్ లో చూడాలని చాలా మంది అనుకున్నారు. అప్పట్లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరంజీవి చివర్లో కాపాడే పాత్రలో ఫైట్ చేసే సీన్ పవన్ చేస్తారు. ఆ ఒక్కటి తప్పితే ఈ ఇద్దరు కలిసి ఫుల్ రోల్ లో చేసింది లేదు.


అయితే ఇప్పటికీ వెండితెరను ఏలుతున్న ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలన్న కోరిక అభిమానుల్లో ఉంది. ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి.. అశేష అభిమానులున్న పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే ఆ సినిమా బాక్సాఫీస్ ను ఊపేయడం ఖాయం. కానీ వీరిద్దరి మెప్పించి ఒప్పించే కథ కావాలి. అప్పుడే సినిమా ఆడుతుంది.

ఇటీవల ఆచార్యలో చిరంజీవి, ఆయన తనయుడు ప్యాన్ ఇండియా హీరో రాంచరణ్ కలిసి చేసినా కథాలోపంతో ఆ సినిమా ఆడలేదు. అందుకే అలాంటి పొరపాట్లు లేని కథాంశం అయితే ఖచ్చితంగా ఈ అన్నాదమ్ములను వెండితెరపై చూడొచ్చు.

ఇటీవల గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ తర్వాత చిరంజీవికి ఇదే ప్రశ్న ఎదురైంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తారా? అన్న ప్రశ్నకు చిరంజీవి ఆసక్తిగా స్పందించారు. 'తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే సినిమాకి రెడీ అంటూ' చిరంజీవి సై అన్నారు. ఇక రాజకీయాల్లోనూ తన మద్దతు తమ్ముడు పవన్ కేనని.. అలాంటి నిబద్ధత గల నాయకుడు జనాలకు అవసరం అని.. రావాలని.. గెలవాలని కోరుకుంటున్నట్టు వివరించారు.

మొత్తంగా టాలీవుడ్ లో చిరు, పవన్ లను పెట్టి దమ్మున్న కథ రాస్తే మాత్రం ఈ ఇద్దరూ నటించడానికి అభ్యంతరం లేదని తెలుస్తోంది. చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. పవన్ అన్నయ్య మాటను కాదనే రకం కాదు. సో ఈ కథ రావాలని మనం అంతా ఆశిద్ధాం.

మరింత సమాచారం తెలుసుకోండి: