లబ్రిటీ కపుల్ రణ్‌బీర్ కపూర్  ఆలియా భట్  హీరో, హీరోయిన్‌లుగా నటించిన సినిమా 'బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ' బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ కరణ్ జోహార్  ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఫాక్స్ స్టార్‌స్టూడియోస్‌తో కలసి నిర్మిం చాడు. అయాన్ ముఖర్జీ  దర్శక త్వం వహించాడు. ఈ మూ వీ పాన్ ఇండి యాగా తెరకెక్కింది. బీ టౌన్ హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో రూపొందింది. తెలుగు, తమిళం, మల యాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అయింది. ఈ సినిమాను థయేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీ లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదు రు చూస్తు న్నారు. ప్రేక్షకు ల ఎదురు చూపులకు తెర దించు తూ డిజి టల్ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్

డేట్‌ను ప్రకటించింది.
బ్రహ్మాస్త్ర' స్ట్రీమింగ్ రైట్స్‌ 'డిస్నీ+హా ట్‌స్టార్‌' దగ్గర ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ 4నుంచి ఓటీటీ ప్లాట్‌పా మ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అన్ని భాషల్లోను స్ట్రీ మింగ్ కానుందని సమాచారం. అందుకు సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రం అధికారికంగా ప్రకట నను వెలువరించలేదు. 'బ్రహ్మాస్త్ర' తెలుగు వెర్షన్‌కు యస్‌యస్. రాజమౌళి సమర్పి కుడిగా వ్యవహరించాడు. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాడు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లోను ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్ల ను రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొ ట్టిన మూవీగా రికార్డు సృష్టించింది. 'బ్రహ్మాస్త్ర' మూడు భాగాలు గారూపొందనుంది. మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్, షారూఖ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫస్ట్ పార్ట్‌లో రణ్‌బీర్ శివ పాత్రలో కని పించాడు. రెండో భాగం మొత్తం దేవ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. దేవ్ రోల్ కోసం మేకర్స్ హృతిక్ రోషన్, రణ్‌వీర్ సింగ్‌లతో చర్చలు జరుపుతున్నారు....

మరింత సమాచారం తెలుసుకోండి: