యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించిన ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనుండగా ,  రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివమూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ 30 మూవీ కి సంబంధించిన అధికారకా ప్రకటన వచ్చే చాలా కాలమే అవుతున్న , ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించబోయే ముద్దు గుమ్మ పేరుని మాత్రం చిత్ర బృందం అధికారికంగా ప్రకటించ లేదు.

దానితో ఎన్టీఆర్ 30 వ మూవీ లో అలియా భట్ హీరోయిన్ గా నటించబోతుంది అని ,  రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతుంది అని ,  సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుంది అని ,  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతుంది అని ఎంతో మంది పేర్లు తెర పైకి వచ్చాయి. అలాగే కొన్ని రోజుల క్రితం పెళ్లి సందD బ్యూటీ శ్రీ లీల , ఎన్టీఆర్ 30 వ మూవీ లవ్ హీరోయిన్ గా నటించబోతుంది అని కూడా కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ 30 వ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గ నటించబోతుంది అనే వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: