మట్టిలో నుంచి పుట్టిన కథ 'కాంతార'.రిషబ్‌ ఏ ఎమోషన్‌లో కథ రాసుకున్నారో.. అదే ఎమోష న్‌కు కట్టు బడి నిజాయి తీగా సినిమా చేశారు. అందుకే దీనికి ప్రేక్షకు లంతా కనెక్ట్‌ అవుతు న్నార''న్నారు నిర్మాత అల్లు అరవింద్‌. రిషబ్‌ శెట్టి హీరో గా నటిస్తూ..
స్వీయ దర్శ కత్వం లో తెరకెక్కిం చిన చిత్రమే 'కాంతార'. హోం బలే ఫిలింస్‌ సంస్థ ని ర్మించింది. సప్తమి గౌడ కథా నాయిక. ఈ సినిమా గీతా ఫిల్మ్‌ డిస్టి బ్యూషన్‌ సంస్థ ద్వారా ఇటీ వలే తెలుగు ప్రేక్ష కుల ముం దుకొచ్చింది.ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా చిత్ర హీరో, దర్శకు డు రిషబ్‌ శెట్టి మాట్లా డుతూ.. ''మూడు రోజుల్లో రూ.20కోట్ల వసూళ్లు వచ్చాయి. మా చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఇంత మంచి ఆద రణ లభిస్తు న్నందుకు చాలా సంతో షంగా ఉంది.కథా బల మున్న చిత్రా లకు భాషా పరిమి తులు ఉండ వని ప్రేక్ష కులు ఈ సిని మాతో మరోసారి నిరూపించారు'' అన్నారు. ''నిజానికి నేను డబ్బింగ్‌ సినిమాలు విడు దల చేసేది చాలా తక్కువ. కానీ, ఈ చిత్రం చూశాక ఇందులోని ఎమోషన్స్‌కు, హీరో అభి నయానికి ముగ్దు డ్ని అయిపోయా. ఈ ఎమోషన్స్‌ను తెలుగు ప్రేక్షకులకూ అందిం చాలన్న ఉద్దేశంతో నే మా బ్యానర్‌ ద్వారా దీన్ని తెలుగులో విడుదల చేశాం.అనుకున్న ట్లుగానే ఈ చిత్రం థి యేటర్స్‌లో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తోంది. విభిన్నమైన సినిమాలు కోరుకునే వారికి మా 'కాంతార' కచ్చితంగా నచ్చుతుంది. రిషబ్‌ శెట్టి త్వరలో మా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. చాలా ఆనం దంగా ఉంది'' అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. కార్యక్ర మంలో సప్తమి, రాంబాబు గోసాల, ప్రమోద్‌ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: