కేవలం ఒక్క చిత్రం బ్లాక్ బస్టర్ అయితే చాలు అందులో నటించిన హీరో తన తదుపరి ప్రాజెక్టులు విషయంలో పలు కండిషన్లు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయింది. అందులో ముఖ్యంగా రెమ్యూనరేషన్ పెంచడంతోపాటు బడ్జెట్ లో కూడా కండిషన్లు పెడుతున్న ఒక యువ హీరో అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ హీరో ఎవరు ఆ కండిషన్లు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2 సినిమాని డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కంటే భారీగా రెస్పాన్స్ లభించడమే కాకుండా కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక ఈ చిత్రం తెలుగులో విజయవంతం కావడంతో పలు భాషలలో కూడా ఈ సినిమాని విడుదల చేసి మంచి సక్సెస్ను అందుకున్నారు. కార్తికేయ-2 తో ట్రెండ్ సెట్ చేసిన హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ తన తదుపరి సినిమాల విషయంలో నిర్మాణ విలువలు తనకు పెరిగిన మార్కెట్కు తగ్గట్టుగా ఉండాలని కండిషన్లు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే ఈ సినిమా తర్వాత తను చేయబోయే సినిమా మార్కెట్ కి తగ్గట్టుగా బడ్జెట్ ఉండాలని డిమాండ్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 18 పేజీస్ సినిమాని కూడా రి షూట్ చేస్తున్నారనే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కార్తికేయ సినిమాకి సీక్వెల్స్ కూడా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక తను నటించే ప్రతి ఒక్క సినిమాలో కూడా తన రెమ్యూనరేషన్ డిమాండ్ తోనే కాకుండా బడ్జెట్ పరంగా కూడా డిమాండ్ చేస్తూ ఉండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి హీరో నిఖిల్ అనుకున్నంత స్థాయిలో తన తదుపరి చిత్రాలు సక్సెస్ అవుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: