బిగ్ బాస్ లో కొత్త కొత్త ట్రాక్ లను కలుపుతున్నాడుబిగ్ బాస్..నిన్న మొన్నటి వరకూ కొట్టుకున్న జంటలు ఇప్పుడు కలిసిపోతున్నాయి.తాజాగా విడుదల చేసిన ప్రోమోతో రెండురోజులుగా ఉన్న డల్‌ టాక్‌ పోయేలా ఉంది. ఇంటి సభ్యులంతా మాంచి ఎనర్జీగా ఆడుతున్నట్లు ప్రోమోలో చూపించారు. దీనిని బట్టి ఇనయా శ్రీహాన్‌కి దగ్గర అవుతున్నట్లు కనిపిస్తుంది. వివరాల్లొకి వెళితే..శ్రీహాన్‌ పుట్టినరోజు కోసమని ఇంటి సభ్యులు కేక్‌ తయారు చేస్తున్నారు. అందులో శ్రీహాన్‌ పేరును ఛోటు అని రాయమని, పక్కనే చిన హార్ట్‌ సింబల్‌ వేయమని ఇనయా కోరుతుంది.


పక్కనే ఉండి, ఇదంతా చూసిన శ్రీహాన్‌ 'ఈరోజు నా కొంప ముంచేలా ఉన్నారు' అంటూ తల పట్టుకున్నాడు. ఈలోపే శ్రీసత్మ, కీర్తి భట్‌ సైలెంట్‌గా వచ్చి 'హ్యాపీ బర్త్‌డ్‌ ఛోటు' అంటూ శ్రీహాన్‌కి విషెస్‌ చెబుతారు.ఆ కాసేపటికే బిగ్‌బాస్‌ అందరినీ సమావేశపరచి కొత్త టాస్క్‌ ఇచ్చాడు. బుధవారం ఎపిసోడ్‌ అంతా భోజనం కోసం పొట్లాడిన ఇంటి సభ్యులు గురువారం టాస్క్‌లో ఇంట్లో ఉండటానికి అర్హత కోసం పోరాటం అని బిగ్‌బాస్‌ సెలవిచ్చారు. ఇందులో భాగంగా రెండు టీమ్‌లుగా ఇంటి సభ్యులు విడిపోయి ఆట మొదలెట్డారు. ఈ టాస్క్‌లో తొలుత రేవంత్‌, అర్జున్‌ మధ్య గొడవ మొదలైంది. 'నువ్వెవడు నాకు చెప్పడానికి అంటే నువ్వెవడు' అంటూ గొడవ పడ్డారు.


 అడ్డొస్తే తోసిపడదొబ్బు అనే పదాన్ని కూడా వాడాడు రేవంత్‌. దీనితో కోపగించిన శ్రీసత్య.. 'తోసిపడదొబ్బు.. తీసి పడదొబ్బు అంటే ఎవడూ ఒప్పుకోడు ఇక్కడ' అని ఫైర్‌ అయింది. అదే సమయంలో అర్జున్‌ని శ్రీహాన్‌ ఎత్తి పడేశాడు. దమ్ముంటే అడ్డుకోమని తొడగొట్టి సవాల్‌ విసిరారు..శ్రీహాన్‌కు, అర్జున్‌కు మధ్య పెద్ద గొడవే జరిగినట్లు ప్రోమోలో చూపించారు. పిల్లి గిల్లీ.. తల్లి అంటూ గీతూపై కామెంట్లు చేశారు. మరి నేటి ఆట ఎలా సాగుతుందో చూడాలి. ఈ వారం నామినేషన్స్‌, ఓటింగ్‌ ప్రకారం.. శ్రీహాన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆటను ఇరగాడుతున్నాడు. ఓటింగ్‌లోనూ టాప్‌లో ఉన్నాడు. ఇంటి సభ్యులు అందరితో కంపేర్‌ చేస్తే బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇస్తున్నాడు..ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎవరిని వరిస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: